సారే జహాసె అచ్ఛా

రచన: మహమ్మద్ ఇక్బాల్ (ఉర్దూలో)

సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా||

పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా||

గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియా
గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా హమారా||

మజ్ - హబ్ నహీ సిఖాతా ఆపస్‌మె బైర్ రఖ్‌నా
హిందీ హై హమ్ వతన్ హై హిందుస్తాన్ హమారా||

వందేమాతరం

జాతీయ గీతము
రచన: శ్రీ బకించంద్ర చటోపాధ్యాయ గారు (ఆనందమట్ నుండి )

వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం ||వందే||

శుభ్రజ్యోత్స్నం పులకిత యామినీమ్
పుల్లకు సుమిత ద్రుమదల శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషినీం
సుఖదాం వరదాం మాతరం ||వందే||

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం ||వందే||

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే బహుతే
తుమి మా శక్తి హృదయే
తుమి మా భక్తి తో మారయి
ప్రతిమాగడి మందిరే మందిరే ||వందే||

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం,
నమామి కమలాం అమలాం,
అతులాం, సుజలాం, మాతరం ||వందే||

శ్యామలాం, సరలాం, సుస్మితాం,
భూషితాం ధరణీం, భరణీం, మాతరం ||వందే||

జన గణ మన

భారత జాతీయ గీతము
రచన : శ్రీ రబీంద్రనాధ్ టాగూరు గారు

జన గణ మన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!

తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

జయ జయ ప్రియ భారత

రచన: శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ సస్యశ్యామల సుశ్యామ చలాంచ్చేలాంచల!
జయ వసంత కుసుమ లతా - చలిత లలిత చూర్ణకుంతల!
జయ మదీయ హృదయాశయ - లాక్షారుణ పద యుగళా! || జయ ||

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ!
జయ గాయక, వైతాళిక - గళ విశాల పద విహరణ
జయ మదీయ మదురగేయ చుంబిత సుందర చరణా! || జయ||

పంచ బాణాలు

పంచ బాణాలు
మన్మధుడు చెరుకు తో చేసిన విల్లు, ఐదు సువాసన గల  పూల బాణాలు ధరించి ఉంటాడు.
ఆ అయిదు పూలు ఏమిటంటే,
  1. అరవిందము - పద్మము   (lotus)
  2. అశోకము  (Jonesia asōka) 
  3. చూతము - మామిడి పూత (mango blossom ) आम 
  4. నవమల్లిక - మల్లె  పూవు (Jasmine)  मोगरा 
  5. నీలోత్పలము -  నీలి కలువ (blue lotus )
 ఈ ఐదు పూలు ఐదు రకాల మోహాలను కలిగిస్తాయి అంటారు.  అవి వరుసగా
  ద్రావిణి (flurry)- తీవ్రమైన కదలిక,
  శోషిణి (pinning) - మమేకం అవ్వటం,
  బంధిని (enslaving ) -  కట్టివేయబడటం 
  మోహిని(bewitching) -ఆకర్షించబడటం
  ఉన్మాదిని (maddening) - పిచ్చెక్కటం

పంచ ద్రావిడులు

పంచ ద్రావిడులు 
తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, మహారాష్ట్రులు 

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

ఆంధ్ర రాష్ట్ర గీతము  
రచన: శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు 
 
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచియుండేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

విజయీ విశ్వతిరంగా ప్యారా

విజయీ విశ్వతిరంగా ప్యారా
ఝండా ఊంఛా రహే హమారా ||ఝండా||

సదా శక్తి బర్సానే వాలా
ప్రేమ సుధా సర్సానే వాలా
వీరోంకో హర్షానే వాలా
మాతృభూమికా తన్ మన్ సారా ||ఝండా||

స్వతంత్రతాకీ భీషణ రణ్ మే
లగ్‌కర్ బడె జోష్ క్షణ్ క్షణ్‌మే
కావే శత్రు దేఖ్‌కర్ మన్‌మే
మిట్ జావే భయ్ సంకట్ సారా ||ఝండా||

ఇన్ ఝండేకే నీచే నిర్భయ్
లే స్వరాజ్య యహ అవిచల నిశ్చయ్
బోలో, భారత్ మాతాకీ జయ్
స్వతంత్రతా హి ధ్యేయ్ హమారా ||ఝండా||

ఇస్ కీ షాన్ నీ జానే పావే
చాహె జాన్ భలేహి జాయె
విశ్వ విజయ కర్ కే దిఖ్ లావే
తబ్ హూవే ప్రణ పూర్ణ హమారా ||ఝండా||

దేశమును ప్రేమించుమన్నా

రచన : శ్రీ గురజాడ అప్పారావు గారు 


దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !
పాడిపంటలుపొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !
ఈసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్
జల్డుకొని కళలెల్ల నేర్చుకు
దేశి  సరుకులు నించవోయ్ !
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకులు నమ్మవెలె నోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !
వెనుక చూసిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనుకేనోయ్ !
పూను స్పర్దను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !
దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను,  వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసె నోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్ల లోయి !
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !
చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయి !
దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలె నోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలె నోయి !
ఆకులందున అణగి మణగీ
కవిత పలకవలె నోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయి !

పంచ యజ్ఞాలు

 గృహస్తు ఈ క్రింది ఐదు యజ్ఞాలు తప్పక ఆచరించాలని పెద్దలు చెప్పారు.
  • దేవ యజ్ఞ   - consists of offering ahutis to devas    - దైవ భక్తి కలిగి సేవ, ఆహుతులు చెయ్యటం.
  • పితృ యజ్ఞ - consists of offering libations to ancestors or pitrs      - పెద్దలకు సేవ మరియు వారు గతించిన తర్వాత కర్మ కాండల ద్వారా కృతజ్ఞత చెప్పటం.
  • భూత యజ్ఞ - consists of offering bali or food to all (departed) creatures    -  భూత దయ కలిగి ఉండి సృష్టి లోని సూక్ష్మ స్థూల జీవులకు బలి (ఆహారం)  వంటి వి సమర్పించటం.
  • మనుష్య యజ్ఞ - consists of feeding guests   - అధితి అభ్యాగతులను ఆదరించటం.
  • బ్రహ్మ యజ్ఞ - consists of reciting of bráhman, i.e. the stanzas of the Vedas, namely Rigveda, Yajurveda, Samaveda and Atharvaveda              --బ్రహ్మ విద్య అనగా వేదముల ను ఆదరించటం, అధ్యయనం చెయ్యటం. లేదా చేసిన వారిని ప్రోత్సహించి వారి వద్దనుండి తెలుసుకొనటం.

అష్ట కష్టాలు

అప్పు పడి ఉండటం
అడుక్కోవడం
ముసలితనం
దొంగతనం
జారత్వం
దరిద్రం
రోగం
మరొకరి తినగా మిగిలింది, తిని వదిలేసింది తినవలసిరావడం -
శంకరాచార్య విరచిత లలితా పంచరత్నం

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బిమ్బా ధరం పృదుల మౌక్తిక సోభి నాకం
ఆకర్ణ దీర్ఘ నయనం మణి కుండలాఢ్యం
మందస్మితం మృగ మదోజ్వల ఫాల దేశం

ప్రాతః భజామి లలితా భుజ కల్ప వల్లిం
రత్నామ్గుళీయ లసదంగులి పల్లవాఢ్యాం
మాణిక్య హేమ వలయాన్గద సోభామానం
పున్ద్రేక్షు చాప కుసుమేషు శ్రునీర్దదానాం

ప్రాతర్ నమామి లలితా చరణారవిందం
భక్తేష్ట దాన నిరతం భవ సింధుపోతం
పద్మాసనాది సుర నాయక పూజనీయం
పద్మాంకుశ సుదర్సన లాంచనాఢ్యాం

ప్రాతః వదామి లలితే తవ పుణ్య నామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవ తేతి వచసాం త్రిపురేశ్వరీతి


ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంత వేద్య విభావాం కరుణాల వద్యాం
విశ్వస్య సృష్టి విలయ స్తితి హేతు భూతాం
విస్వేశ్వరీం నిగమ వాగ్మనసాతిదూరాం

అన్నమయ్య - కొన్ని జీవిత విశేషాలు

అన్నమయ్య 1424-1503 తొలి తెలుగు వాగ్గేయ కారుడు. పద కవితా పితామహుడు అని ఆయన బిరుదు.
తల్లి దండ్రులు నారాయణ సూరి (కుమరనారాయణ ) , లక్ష్మాంబ. తాళ్ళపాక కు చెందినా వారు. తాత గారు నారాయణయ్య గారు పక్కనే ఉన్నా ఉటుకూరు లోని చింతలమ్మ తల్లి గుడి వద్ద ఆత్మ హత్య చేసుకొన బోగా ఆ దేవత మూడవ తరం లో నీ ఇంట మహనీయుడు, హరి భక్తుడు పుడతాడని చెప్పి ఆయనను ఆపిందట.
ఈయన పెద్ద భార్య అక్కలమ్మ. చిన్న భార్య తిమక్క. సుభద్ర కళ్యాణం అను కావ్యాన్ని రచించిన తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి గా చెప్పబడు చున్నది.
పిల్లలు పెద్దతిరుమలచార్య , నరసింగన్న.అష్టమహిషి కళ్యాణం వ్రాసినది పెద్దతిరుమలచర్య
మనుమలు చిన్న తిరుమలాచార్య,తాళ్ళపాక చిన్నన్న .
గురువు, అహోబిలం కి చెందిన అడివన్ శఠగోప యతి. ఈయనే అన్నమయ్యకు వైష్ణవ మతం బోధించాడు.
"దాచుకో నీపాదాలకు తగనే చేసిన పూజలివి" అనేది ఈయన చివర కృతి కాగా
నారాయణతే నమో నమో" అనే కృతి పురందర దాసు తన వద్దకు వచ్చినప్పుడు ఆయనతో కలసిచేసారని ప్రతీతి .
సాళువ నరసింహ అనే విజయ నగర రాజు ఈయన ను ఆదరించి ఈయన పాటలను రాగి రేకుల పై రాయించాడు.

సప్త ద్వీపాలు

భూమి పై 7 ద్వీపాలు (అన్ని వైపులా సముద్రం మధ్యలో భూమి కల ప్రాంతాలు) ఉన్నవి. అవి,
  1. జమ్భు
  2. ప్లక్ష
  3. శక
  4. సల్మలి
  5. కుస
  6. క్రౌంచ
  7. పుష్కరాఖ్య

14 లోకాలు

భూమి తో సహా మొత్తం 14 లోకాలు ఉన్నట్లు మన పురాతన గ్రంధాలు చెపుతాయి.
భూమి కంటే కింద నున్న 7 లోకాలను పాతాళ లోకాలు అని అంటారు. అవి,

1. అతల- 2. వితల- 3. సుతల- 4. రసాతల- 5. తలా తల- 6.మహాతల- 7. పతలక లోకాలు .
ఈ పాతాళ లోకాల పైన ,

1.భూః  – 2. భువర్ - 3. సువర- 4. మహార- 5. జనర్ - 6.తాప- 7. సత్యాఖ్యి అను మరో 7 లోకాలు ఉన్నవి .
వీటిలో   భూః  అంటే మనము ఉంటున్న భూమి అని అర్ధం.


అసలు నిర్వచనం ప్రకారం పాతాల లోకాలు అంటే మొత్తం భూగోళానికి కింద విశ్వం లో ఉన్న లోకాలని , ఊర్ద్వ లోకాలు భూగోళం పై ఉన్న దేవ లోకాలు అని అర్ధం. ( Aliens  అంటే ఇప్పటి పిల్లలకు  బాగా అర్ధం అవుతుందేమో )


పురాణాలను ఉన్టంకిస్తూ తెలుగులో ఉన్న  ఈ పద్యం చూడండి..

బలుడుండు అతలమా
హటకేశుని వితలమా
బలివుండు సుతలమా
మయుని తలాతలమా
నాగచతుష్టఁపు మహాతలమా
పణిదానవుల రసాతలమా
నాగరాజుల పాతాలమా



తేనెల తేటల మాటలతో

రచన : ఇంద్ర గంటి శ్రీ కాంత శర్మ గారు

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా  ||తేనెల||

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు  ||తేనెల||

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే  ||తేనెల||

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని  ||తేనెల||


check it here..
http://lahari.freewebhostx.com/audio/telugu_patriotic_songs/index.html

27 నక్షత్రములు , 12 రాశులు

ఆకాశం లో చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అయితే మనము 27 స్థిరంగా ఉండే నక్షత్రాలను మాత్రము మన ప్రాచీన జ్యోతిష /ఖగోళ శాస్త్రం లో అధ్యయనం చేస్తాము.

ఆకాశమును ఒక వర్తులా కార చక్రముగా ఊహించుకొని, దానిని 27 భాగాలుగా చేస్తే ప్రతి భాగాన్ని, ఆ భాగంలో ఉండే ఒక నక్షత్రం పేరుతొ పిలుస్త్తో ఉంటాము.

ఈ వర్తులాకారం, నక్షత్రాలుగా పిల్చుకొనే ఈ 27 భాగాలు స్థిరముగా ఉంటాయి. భూమి యొక్క కదిలికతో సంభంధం లేకుండా భూమి పైనుండి చూస్తె ఆకాశంలో వీటి స్థానాలు స్థిరం గా ఉంటాయి.

భూమి తిరగటం వల్ల కావచ్చు, ఇతర ఖగోళ పదార్ధాల కదలిక వల్ల కావచ్చు, 9 గ్రహాలు భూమి పై నుండి చూస్తే ఒకే ప్రదేశంలో (నక్షత్రాల వలె ) కనిపించవు. వాటి స్థానాలు ఆకాశం యొక్క ఈ 27 భాగాలలో ఎక్కడైనా ఉండచ్చు.

మనము ప్రతి నిమిషం లో ఏ గ్రహం ఆకాశం యొక్క ఏ భాగంలో (నక్షత్రంలో ) ఉన్నదో గనించలేము కదా. చంద్రుడు ఏ భాగం లో ఉంటే ఆ రోజు ఆ నక్షత్రం అంటాము. ఇదే మనకు తెలుగు కాలెండర్ లో కన్పించే నక్షత్రం.
ఒక శిశువు జన్మించి నప్పుడు, వివాహాది శుభ కార్యాల కోసం మంచి ముహూర్తం చూడటానికి మాత్రం చంద్రుని తో పాటు ఇతర గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకొని ఏ గ్రహం ఏ నక్షత్రం లో ఉన్నదో లెక్క పెడతారు .
27 నక్షత్రాల పేర్లు ఇలా ఉన్నాయి
అశ్వని , భరణి , కృత్తిక,
రోహిణి, మృగశిర, ఆరుద్ర,
పునర్వసు,పుష్యమి, ఆశ్లేష,
మఖ, పుబ్బ (పూర్వ ఫల్గుని) , ఉత్తర (పల్గుని) ,
హస్త, చిత్త,స్వాతి,
విశాఖ, అనురాధ, జేష్ఠ,
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ ,
శ్రవణం, ధనిష్ఠ ,శతభిషం,
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

ప్రతి నక్షత్రాన్ని నాలుగు భాగాలు చేస్తే ప్రతి భాగాన్ని ఒక పాదం అంటారు. కనుక జ్యోతిష చక్రం అనే ఈ వర్తులాకారం ఆకాశాన్ని 27 X 4 = 108 సమ భాగాలుగా విభజిస్తూ ఉన్నది.

ఇదే వర్తులాకారాన్ని 12 X 9 = 108 భాగాలు గా చేస్తే అవి 12 రాశులు అవుతాయి. ప్రతి రాశి లో తొమ్మిది సమభాగాలు ఉండాలి కదా అంటే తొమ్మిది నక్షత్ర పాదాలు కలిపి ఒక రాశి. ఈ రాశులకు పేర్లు ,గుర్తులు ఉంటాయి.
  1. మేషము (మేక)- అశ్వని (1,2,3,4) , భరణి (1,2,3,4), కృత్తిక (1)
  2. వృషభము (ఎద్దు) - కృత్తిక (2,3,4), రోహిణి (,,,) , మృగశిర (1,2)
  3. మిధునం (జంట) - మృగశిర (3,4) , ఆరుద్ర (1,2,3,4), పునర్వసు (1,2,3)
  4. కర్కాటకము (ఎండ్రకాయ) - పునర్వసు (4), పుష్యమి (1,2,3,4), ఆశ్లేష (1,2,3,4)
  5. సింహము - మఖ (1,2,3,4), పుబ్బ (1,2,3,4), ఉత్తర (1)
  6. కన్య - ఉత్తర (2,3,4), హస్త (1,2,3,4), చిత్త (1,2)
  7. తుల (త్రాసు) - చిత్త (3,4), స్వాతి (1,2,3,4), విశాఖ (1,2,3)
  8. చక్రంబట్టి (ఫలితాలను) - విశాఖ (4), అనురాధ (1,2,3,4) జేష్ట (1,2,3,4)
  9. ధనుస్సు (విల్లు) - మూల (1,2,3,4), పూర్వాషాఢ (1,2,3,4), ఉత్తరాషాఢ (1)
  10. మకరం (మొసలి) - ఉత్తరాషాఢ (2,3,4), శ్రవణం (1,2,3,4), ధనిష (1,2)
  11. కుంభం (కుండ) - ధనిష్ఠ (3,4), శతభిషం (1,2,3,4), పూర్వాభాద్ర (1,2,3,4)
  12. మీనం (చేప) - పూర్వాభాద్ర (4), ఉత్తరాభాద్ర (1,2,3,4) , రేవతి (1,2,3,4)
ఒక సమయంలో ఒక గ్రహం ఏ నక్షత్రం యొక్క ఏ పాదం లో ఉందొ తెలిస్తే , ఏ రాశిలో ఉన్నదో చెప్పవచ్చు. ఈ విషయాన్నే ఒక 12 పెట్టలున్న చతురస్ర లేక వృత్తాకారపు బొమ్మలో వ్రాస్తే దాన్నే రాశి చక్రం /జాతక చక్రం అంటారు.

జాతక చక్రం అంటే ఆ సమయంలో గ్రహాలు ఆకాశం లో ఎక్క ఎక్కడ ఉన్నాయో చెప్పటం మాత్రమె. ఇందులో మూఢ నమ్మకం ఏమి లేదు. పుట్టిన రోజు ని ఎలా ఇంగ్లీష్ కాలెండరు ప్రకారం, తెలుగు తిధుల ప్రకారం గుర్తు పెట్టుకొంతామో ఇది కూడా అలాగే ఆకాశం లో మనకు కనిపించే గ్రహాల స్థానాలను గుర్తించటం.

అయితే ఈ చక్రాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు , స్వభావ లక్షణాలు చెప్పటం మాత్రం ఒక probability ఆధారం గా జరిగిన సంఘటనలు బట్టి , జరగబోయ్యేవి ఊహించి చెప్తారు. దీనికి నిరూపణలు ఉండవు.

పంచ భక్ష్యములు

  1. భక్ష్య - కొరికి తినవలసినది - hard food , - గారెలు వంటివి
  2. భోజ్య - నమిలి తినగలిగినవి - soft food , - చిత్రాన్నము
  3. ఖాద్య - చప్పరించి మింగేవి - మైసూరు పాకు లాంటివి
  4. చోస్య - ద్రవ పదార్దాలు - preparations that are sucked, -
  5. లేహ్య - నాలుకతో నాకి తినేవి - food preparations, which could be licked. - సగ్గుబియ్యం పరమాన్నం

షడ్రుచులు

ఆరు రుచులు
  1. తీపి -sweet
  2. కారం - chili
  3. పులుపు -sour
  4. వగరు -tart
  5. ఉప్పు -salt
  6. చేదు - bitter

నవ గ్రహాలు

జ్యోతిష శాస్త్ర ప్రకారం తొమ్మిది గ్రహాలు ఉన్నవి. గ్రహం అంటే గ్రహించేది. శక్తిని గ్రహించే అన్నిటిని గ్రహాలుగా మన ప్రాచీన ఖగోళ శాస్త్రం చెప్తుంది. అవి,
  1. సూర్యుడు -భాను - ఆదిత్య -రవి
  2. చంద్రుడు - సోమ
  3. భూమి - భౌమ - మంగళ - కుజ
  4. బుధుడు - సౌమ్యుడు
  5. గురుడు - బృహస్పతి
  6. శుక్రుడు
  7. శని - మందుడు
  8. రాహువు
  9. కేతువు
వీటి లో రాహు కేతువులు కేవలం నీడలు కనుక వాటిని చాయా గ్రహాలని అంటారు.

పంచ గవ్యాలు

మన ప్రాచీన వైద్య విధానం, ఆయుర్వేదం లో ఆవుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆవు ద్వారా మనకు వచ్చే ఐదు వస్తువులను పంచ గవ్యాలు అంటారు. ఇవి ప్రకృతి వైద్యంలో వాడతారు. అవి,
  1. గోక్షీరము - ఆవు పాలు
  2. గోఘ్రుతము - ఆవు నెయ్యి
  3. గోదధి - ఆవు పెరుగు
  4. గోమూత్రము - ఆవు మూత్రము
  5. గోమయము - ఆవు పేడ

6 ఋతువులు, 12 మాసములు

తెలుగు వారు చంద్ర గమనాన్ని అనుసరించి మాసాలు లెక్కిస్తారు. అమావాస్య తర్వాతి రోజు (పాడ్యమి) నుండి అమావాస్య దాకా ఒక మాసం.

ఇలా 12 మాసములు ఒక సంవత్సరం గా లెక్క పెడతారు. అయితే సంవత్సరం అంటే సూర్యుని గమనాన్ని బట్టి లెక్కించాలి కనుక కొన్ని సంవత్సరాలలో 12 బదులుగా 13 నెలలు లెక్కిస్తారు. (ఇంగ్లీష్ కాలెండరు లో లీప్ ఇయర్ లా ). అలాంటి సంవత్సరాలలో ఏదో ఒక మాసాన్ని రెండు సార్లు లెక్క వేస్తారు. ఇలా వచ్చే మాసాన్ని అధిక మాసం అంటారు. ఈవిధం గా చాంద్రమానం తో సౌర మానాన్ని కలిపి తెలుగు క్యాలెండర్ రూపొందుతుంది.

రెండు నెలలు (మాసాలు) కలిపి ఒక ఋతువు. ఈ ఋతువుల ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రతి ఋతువులో ప్రకృతి వివిధ రూపాలలో మనకు కనిపిస్తుంది. (ఈ ఋతువులకు ఆంధ్ర దేశాన్ని అనుసరించి పేరు పెట్టారు. భూమి పై ఇతర ప్రాంతాలలో ఇలాగే ఉండాలని లేదు)
  1. చైత్ర, వైశాఖ మాసములు వసంతఋతువు - చెట్లు చిగురిస్తాయి
  2. జేష్ఠ , ఆషాడ మాసములు గ్రీష్మఋతువు - ఎండలు కాస్తాయి
  3. శ్రావణ, భాద్రపద మాసములు వర్షఋతువు - వానలు కురుస్తాయి
  4. ఆశ్వయుజ, కార్తిక మాసములు శరత్ఋతువు - చక్కటి వెన్నెల కాస్తుంది
  5. మార్గశిర, పుష్య మాసములు హేమంతఋతువు- రాత్రులు మంచు కురుస్తుంది
  6. మాఘ, ఫాల్గుణ మాసములు శిర ఋతువు - ఆకులు రాలు కాలము

వేదాంగాలు

నాలుగు వేదాలకు తోడుగా మనకు ఆరు వేదాంగాలు ఉన్నవి.
  1. శిక్ష - సంధి - phonetics and phonology
  2. ఛందస్సు - meter, The rhythm in poetry and music. -
  3. వ్యాకరణము - grammar
  4. నిరుక్త - etymology - భాష పుట్టు పూర్వోత్తరాలు
  5. జ్యోతిష - astrology and astronomy - ఖగోళ , అంతరిక్ష శాస్త్రము
  6. కల్పము - rituals - ఆచార వ్యవహారాలు

చతుర్వేదములు

నాలుగు వేదాలు సనాతన భారతీయ సంస్కృతికి ఆధారాలు. అవి,
  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామ వేదము
  4. అధర్వణ వేదము

పంచ కన్యలు

  1. తార
  2. అహల్య
  3. మండోదరి
  4. కుంతి
  5. ద్రౌపది

పంచ కావ్యాలు

త్రిగుణములు

సత్వ - balance or equilibrium -fineness, lightness, illumination and joy
రజో - expansion or activity -activity, excitation and pain
తమో - inertia or resistance to action -coarseness, heavyness, obstruction and sloth.
గుణములను త్రిగుణములు అంటారు.

కర్మేంద్రియములు

  1. నోరు
  2. చేతులు
  3. కాళ్ళు
  4. మూత్ర,
  5. మల ద్వారాలు

జ్ఞానేంద్రియాలు

  1. కన్నులు - చూపు, ద్రుష్టి
  2. ముక్కు - వాసన , ఆగ్రాణం
  3. చెవులు -వినికిడి , శ్రవణం
  4. నాలుక - రుచి , రసన
  5. చర్మము - స్పర్శ



పంచ భూతాలు

జీవులకు ఐదు ప్రాధమిక ఆధారాలు ..

  1. ఆకాశం
  2. వాయువు
  3. అగ్ని
  4. నీరు
  5. భూమి
మనిషి లో ఐదు ప్రాణాలు ఉంటాయని ఈ ఐదు ప్రాణాలు పంచ భూతాల్లో కలిసి పోతాయని అంటారు.
పంచ భూతాలను సూచిస్తూ ఐదు ప్రసిద్ధ శివ క్షేత్రాలు ఉన్నాయి.
  1. ఆకాశం - చిదంబరం - శివుడు నిరాకారం గా ఉంటాడు
  2. వాయువు - శ్రీకాళ హస్తి - శివలింగం నుండి గాలి వస్తూ ఉంటుంది
  3. అగ్ని -అరుణాచలం - స్వామి దగ్గర వెలుగు ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
  4. నీరు -జంబుకేశ్వరం - శివ లింగం నుండి నీరు వస్తూ ఉంటుంది
  5. భూమి - ఏకాంబరేశ్వర , కంచి -

నవధాన్యాలు

  1. వరి -paddy - चावल
  2. ఉలవలు - horse gram - गहत , कुलथ
  3. పెసలు - green gram - मूंग दाल
  4. మినుములు - black gram - उर्द दाल
  5. నువ్వులు - sesame - तिल
  6. గోధుమలు - wheet - गेहू
  7. అనుములు -cowpea - चवली
  8. కందులు - pigeon pea , red gram - तूर दाल, तूवार
  9. శనగలు - chickpea , bengal gram, indian pea - चना दाल , छोले

అష్ట దిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
  1. తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
  2. పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
  3. దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
  4. ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ .
అలాగే నాలుగు మూలలు. నై వా అనేది కొండ గుర్తు. ఆనై అంటే తమిళం లో ఏనుగు, వాయి అంటే నోరు. ఆనైవాయి అంటే ఏనుగు నోరు అన్నమాట. అలా మనం మూలలు వరసలో గుర్తుపెట్టుకో వచ్చు. తూర్పు నుండి లెక్కిస్తే
  1. ఆగ్నేయం ,
  2. నైరుతి,
  3. వాయువ్యం,
  4. ఈశాన్యం
ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...
  • దిక్కు - దేవత - భార్య - పట్టణం - ఆయుధం - వాహనం
  1. తూర్పు - ఇంద్రుడు - శచి - అమరావతి - వజ్రాయుధం - ఐరావతం
  2. ఆగ్నేయం - అగ్నిదేవుడు - స్వాహా - తేజోవతి - శక్తి - తగరు
  3. దక్షిణం - యముడు - శ్యామల- సంయమని - పాశం - దున్నపోతు
  4. నైరుతి - ని ర్రు తి - దీర్ఘా దేవి- కృష్ణ గమని - కుంతం - నరుడు
  5. పశ్చిమం - వరుణుడు - కాళిక- శ్రద్ధావతి - దండం - మొసలి
  6. వాయువ్యం - వాయువు -అంజన - గంధవతి - ద్వజం - - జింక
  7. ఉత్తరం - కుబేరుడు - చిత్ర రేఖి - అలకాపురి - కత్తి- అశ్వం
  8. ఈశాన్యం - ఈశానుడు - పార్వతి - కైలాసం - త్రిశూలం - నంది

త్రిమూర్తులు

బ్రహ్మా విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు.
పరమాత్మ స్వరూపం ఒకటే అయినా అది మూడు రూపాలలో ఈ ప్రపంచాన్ని నడి పిస్తుంది.

  1. బ్రహ్మా రూపంలో సృష్టి
  2. విష్ణు రూపంలో పాలన (స్థితి)
  3. రుద్రుని గా లయ చెయ్య బడుతుంది
మరి వీరితో సహచర్యం చేస్తూ సమస్త లోకాలను అమ్మల వలె కాపాడే ముగ్గురు అమ్మలు ,
  1. బ్రహ్మ నాలుక పై సంచరించే సరస్వతి
  2. విషు మూర్తి వక్ష స్తలంలో ఉండే లక్ష్మి
  3. ఈశ్వరుని అర్ధ భాగము అయిన పార్వతి


త్రికరణములు

మనసు, వాక్కు, శరీరం
ఈ మూడింటికి సమన్వయము కుదిరి చేసిన పనే సంపూర్ణం గా ఉంటుంది. మనో వాక్కాయక కర్మలు అంటే అవే.
మనసు ఒకటి చెప్తే వాక్కు ఒకరకం గా సూచిస్తుంటే శరీరం ఇంకో రకం గా పని చేస్తే అది వన్నెకెక్కదు. అటువంటి పని చెయ్యటం కంటే మానటం మంచిది.

నవ విధ భక్తి

భగవతుణ్ణి భక్తి మార్గం లో ఆరాధించ టానికి తొమ్మిది రకాలైన విధానాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ లేక కొన్ని పాటించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చు.
  1. శ్రవణం - దేవుని గురించి వినుట
  2. కీర్తనం - అన్నమయ్య వలె , త్యాగయ్య వలె దేవుని కీర్తి పాడుట
  3. దైవ స్మరణ - నారదుని వలె నిరంతరం నామం స్మరించుట
  4. పాద సేవ - గరుడుని వలె స్వామి సేవ చేయటం
  5. అర్చన - ఆవాహనము , ఆసనం, అర్ఘ్యం, పాద్యము , స్నానము, వస్త్రము, అలంకారం, పూజ, ధూపం, దీపం, నైవేద్యము, నీరాజనం వంటి పద హారు చర్యలతో అర్చించటం.
  6. వందనం- త్రికరణ (మనసు, వాక్కు , శరీరం) సుద్ది గా నమస్కరించటం .
  7. దాస్యం - హనుమంతుని వలె దాస్యం చేయటం
  8. సఖ్యం - గోపికల వలె అర్జునిని వలె దేవుని తమ సఖుని గా భావించి తనపై భారం వేయటం.
  9. ఆత్మ నివేదనం - ఆత్మ (తనను తాను) భగవంతుని కి అర్పించి స్వామి సంకల్పం పై కర్మలు చేయటం.

పంచారామాలు

సుబ్రహ్మణ్య స్వామి తారకాసురున్ని వధించినప్పుడు ఆయన మెడ లోని శివ లింగం ఐదు ప్రదేశాలలో పడింది. ఆ ఐదు పంచారామాలు గా ప్రసిద్ది గాంచాయి.

  1. అమరారామం - అమరావతి - గుంటూరు దగ్గర ( ఇది ప్రసిద్ది చెందిన బౌద్ద ఆరామాలలో ఒకటి కూడా )
  2. ద్రాక్షారామం - తూ గో జిల్లా రామచంద్రా పురం దగ్గర (ఇది అష్టా దశ శక్తి పీఠాల లో ఒకటి కూడా , మాణిక్యాంబ)
  3. కుమారారామం - సామర్ల కోట- తూ గో జిల్లా
  4. భీమా రామం - భీమవరం - ప గో జిల్లా
  5. క్షీరారామం - పాలకొల్లు - ప గో జిల్లా నరసాపురం దగ్గర

ఏ దేశమేగినా ఎందు కాలెడినా

Poet - రాయప్రోలు సుబ్బా రావు - Raayaprolu Subba Rao

ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.

లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము.

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక

దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర

వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర
దీవించె నీ దివ్య దేశంబు పుత్ర
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట

పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ
కానలా కస్తూరి కాచరా మనకు.

అవమానమేలరా ? అనుమానమేలరా ?
భారతేయుడనంచు భక్తితో పాడ!
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్లగా నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ


ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరించంగా
అపరాకారికి ఉపకారము
నేప మెన్నక చేయువాడు నేర్పరి సుమతీ

కొన్ని సుమతీ శతక పద్యాలు

తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ

కొన్ని సుమతీ శతక పద్యాలు

బద్దకము సంధ్య నిద్దుర వద్దు సుమీ
దద్దిరంబు వచ్చును దానన్
గద్దిన్తురు పెద్ద వారలు
మొద్దందురు తోటి వారలు ముద్దు సుమీ

కొన్ని వేమన పద్యాలు

అనువుగాని చోట నథికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువు గాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినుర వేమ!

అల్పుడెపుడుఁబల్కు నాడంబరముగాను
సజ్జ నుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

అనగ అనగ రాగము అతిశయిల్లుచు  నుండు
తినగ తినగ వేము తియ్య నుండు
సాధనమున పనులు సమకూరు ధర లోన
విశ్వదాభిరామ వినుర వేమ!

అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

ఆత్మశుద్ధి లేని ఆచరమేల
భాండ శుద్ది లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజ లేలయ
విశ్వదాభి రామ వినుర వేమ

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ !

కనియు గానలేఁడు కదలింపఁడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్నిపాతం బిది
విశ్వదాభిరామ వినుర వేమ!

గంగిగోవు పాలు గంటిడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ!

చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు
చదువు జదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదువగ చూడుము
విశ్వదాభిరామ వినుర వేమ !

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్ట లోన చదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ!


పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బట్టవలయుఁ
బట్టి విడుటకన్నఁ బరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ!

పర నారీ సోదరుఁడై
పరధనములు కాసపడక!పరహిత చారై
పరు లలిగిన తా నలగక
పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!

పనస తొనలకన్న పంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్న
చెరుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ వినుర వేమ!


మేడిపండు చూడు మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడు పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ!

వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ వినుర వేమ!



15. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపే గని తెలుపు రాదయ
విశ్వదాభి రామ వినుర వేమ

అక్షరాల పాట

అమ్మ మాట చల్లన
ఆవు పాలు తెల్లన

ఇటిక గోడ మందము
ఈల పాట విందము

ఉడుత తోక అందము
ఊయలూగు చుందము

ఎలుక వల్ల నష్టము
ఏనుగు ఎక్కుట ఇష్టము

ఐసు బలే చల్లన
ఒంటె నడక మెల్లన

ఓడ నీట తేలును
ఔటు భలే పేలును

అంగట్లో మిఠాయి
అః తింటే హాయి