ప్రార్ధనా శ్లోకాలు

గణపతి:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏక దంతముపాస్మహే


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

తులసి:
యన్మూలే సర్వ తీర్ధాని యన్మధ్యే సర్వ దేవతా
యదగ్రే సర్వ వేదాస్చ తులసీం త్వాం నమోనమ:

సరస్వతి దేవి:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమేసదా

మాణిక్య వీణా ముపలాల యంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీల ద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి.


లక్ష్మి దేవి:
పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే
నారాయణే ప్రియే దేవీ సుప్రీతా మమ సర్వదా

లక్ష్మీం క్షీర సముద్ర దేవ తనయాం
శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం
లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లభ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం  సరసిజాం వందే ముకుంద ప్రియాం


విష్ణుమూర్తి:

శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సద్రుశ్యం మేఘవర్ణం  శుభాంగం
లక్ష్మీకాంతం కమల నయనం యోగి హ్రుద్యాన గమ్యం
వందే విష్ణుం భవ భయ హరం సర్వలోకైక నాధం


హనుమ:
బుద్ది: బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాఢ్యం వాక్పటుంచ హనుమత్ స్మరణాత్ భవేత్
(బుద్ది, బలం, కీర్తి, ధైర్యం, భయం లేక పోవటం, ఆరోగ్యం, చురుకుతనం, మాట చతురత హనుమంతుని ఉపాసన వల్ల కలుగుతాయి)

యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
భాష్పవాది పరిపూర్ణ లోచనం
నమత మారుతిం రాక్షసాంతకం
(ఎక్కడెక్కడ రామ జపం వినిపిస్తే అక్కడ చేతులుకట్టుకొని ఆర్ధ్రంగా నిలిచే రాక్షసాంతకుడైన మారుతి కి నమస్కరిస్తున్నాను)


గోష్పదీ కృత వారాశిం, మశకీ కృత రాక్షసం
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజం
( పెద్ద సముద్రాన్ని ఆవు కాలంత ప్రమాణం గా ఘోర రాక్షసుల్ని దోమల వలే చేసిన
ఓ వాయు దేవుని పుత్రుడా నీవు రామాయణం అనే గొప్ప హారంలో రత్నానివి)

దశ వాయువులు - పంచ ప్రాణాలు

పంచ ప్రాణాలు
ప్రాణ వాయువు: శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు
అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు
వ్యాన:  శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం
ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు
సమాన:  జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు
ఉప ప్రాణాలు
నాగ : త్రేన్పు గా వచ్చే గాలి
కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి
కృకల :  తుమ్ము
ధనంజయ :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.
దేవదత్తం  : ఆవులింత లోని గాలి
అనే దశ వాయువులు శరీరంలో ఉంటాయని అంటారు.

ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.

ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది.
(ref., chaaganti Koteswara Rao garu)