27 నక్షత్రములు , 12 రాశులు

ఆకాశం లో చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అయితే మనము 27 స్థిరంగా ఉండే నక్షత్రాలను మాత్రము మన ప్రాచీన జ్యోతిష /ఖగోళ శాస్త్రం లో అధ్యయనం చేస్తాము.

ఆకాశమును ఒక వర్తులా కార చక్రముగా ఊహించుకొని, దానిని 27 భాగాలుగా చేస్తే ప్రతి భాగాన్ని, ఆ భాగంలో ఉండే ఒక నక్షత్రం పేరుతొ పిలుస్త్తో ఉంటాము.

ఈ వర్తులాకారం, నక్షత్రాలుగా పిల్చుకొనే ఈ 27 భాగాలు స్థిరముగా ఉంటాయి. భూమి యొక్క కదిలికతో సంభంధం లేకుండా భూమి పైనుండి చూస్తె ఆకాశంలో వీటి స్థానాలు స్థిరం గా ఉంటాయి.

భూమి తిరగటం వల్ల కావచ్చు, ఇతర ఖగోళ పదార్ధాల కదలిక వల్ల కావచ్చు, 9 గ్రహాలు భూమి పై నుండి చూస్తే ఒకే ప్రదేశంలో (నక్షత్రాల వలె ) కనిపించవు. వాటి స్థానాలు ఆకాశం యొక్క ఈ 27 భాగాలలో ఎక్కడైనా ఉండచ్చు.

మనము ప్రతి నిమిషం లో ఏ గ్రహం ఆకాశం యొక్క ఏ భాగంలో (నక్షత్రంలో ) ఉన్నదో గనించలేము కదా. చంద్రుడు ఏ భాగం లో ఉంటే ఆ రోజు ఆ నక్షత్రం అంటాము. ఇదే మనకు తెలుగు కాలెండర్ లో కన్పించే నక్షత్రం.
ఒక శిశువు జన్మించి నప్పుడు, వివాహాది శుభ కార్యాల కోసం మంచి ముహూర్తం చూడటానికి మాత్రం చంద్రుని తో పాటు ఇతర గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకొని ఏ గ్రహం ఏ నక్షత్రం లో ఉన్నదో లెక్క పెడతారు .
27 నక్షత్రాల పేర్లు ఇలా ఉన్నాయి
అశ్వని , భరణి , కృత్తిక,
రోహిణి, మృగశిర, ఆరుద్ర,
పునర్వసు,పుష్యమి, ఆశ్లేష,
మఖ, పుబ్బ (పూర్వ ఫల్గుని) , ఉత్తర (పల్గుని) ,
హస్త, చిత్త,స్వాతి,
విశాఖ, అనురాధ, జేష్ఠ,
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ ,
శ్రవణం, ధనిష్ఠ ,శతభిషం,
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

ప్రతి నక్షత్రాన్ని నాలుగు భాగాలు చేస్తే ప్రతి భాగాన్ని ఒక పాదం అంటారు. కనుక జ్యోతిష చక్రం అనే ఈ వర్తులాకారం ఆకాశాన్ని 27 X 4 = 108 సమ భాగాలుగా విభజిస్తూ ఉన్నది.

ఇదే వర్తులాకారాన్ని 12 X 9 = 108 భాగాలు గా చేస్తే అవి 12 రాశులు అవుతాయి. ప్రతి రాశి లో తొమ్మిది సమభాగాలు ఉండాలి కదా అంటే తొమ్మిది నక్షత్ర పాదాలు కలిపి ఒక రాశి. ఈ రాశులకు పేర్లు ,గుర్తులు ఉంటాయి.
  1. మేషము (మేక)- అశ్వని (1,2,3,4) , భరణి (1,2,3,4), కృత్తిక (1)
  2. వృషభము (ఎద్దు) - కృత్తిక (2,3,4), రోహిణి (,,,) , మృగశిర (1,2)
  3. మిధునం (జంట) - మృగశిర (3,4) , ఆరుద్ర (1,2,3,4), పునర్వసు (1,2,3)
  4. కర్కాటకము (ఎండ్రకాయ) - పునర్వసు (4), పుష్యమి (1,2,3,4), ఆశ్లేష (1,2,3,4)
  5. సింహము - మఖ (1,2,3,4), పుబ్బ (1,2,3,4), ఉత్తర (1)
  6. కన్య - ఉత్తర (2,3,4), హస్త (1,2,3,4), చిత్త (1,2)
  7. తుల (త్రాసు) - చిత్త (3,4), స్వాతి (1,2,3,4), విశాఖ (1,2,3)
  8. చక్రంబట్టి (ఫలితాలను) - విశాఖ (4), అనురాధ (1,2,3,4) జేష్ట (1,2,3,4)
  9. ధనుస్సు (విల్లు) - మూల (1,2,3,4), పూర్వాషాఢ (1,2,3,4), ఉత్తరాషాఢ (1)
  10. మకరం (మొసలి) - ఉత్తరాషాఢ (2,3,4), శ్రవణం (1,2,3,4), ధనిష (1,2)
  11. కుంభం (కుండ) - ధనిష్ఠ (3,4), శతభిషం (1,2,3,4), పూర్వాభాద్ర (1,2,3,4)
  12. మీనం (చేప) - పూర్వాభాద్ర (4), ఉత్తరాభాద్ర (1,2,3,4) , రేవతి (1,2,3,4)
ఒక సమయంలో ఒక గ్రహం ఏ నక్షత్రం యొక్క ఏ పాదం లో ఉందొ తెలిస్తే , ఏ రాశిలో ఉన్నదో చెప్పవచ్చు. ఈ విషయాన్నే ఒక 12 పెట్టలున్న చతురస్ర లేక వృత్తాకారపు బొమ్మలో వ్రాస్తే దాన్నే రాశి చక్రం /జాతక చక్రం అంటారు.

జాతక చక్రం అంటే ఆ సమయంలో గ్రహాలు ఆకాశం లో ఎక్క ఎక్కడ ఉన్నాయో చెప్పటం మాత్రమె. ఇందులో మూఢ నమ్మకం ఏమి లేదు. పుట్టిన రోజు ని ఎలా ఇంగ్లీష్ కాలెండరు ప్రకారం, తెలుగు తిధుల ప్రకారం గుర్తు పెట్టుకొంతామో ఇది కూడా అలాగే ఆకాశం లో మనకు కనిపించే గ్రహాల స్థానాలను గుర్తించటం.

అయితే ఈ చక్రాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు , స్వభావ లక్షణాలు చెప్పటం మాత్రం ఒక probability ఆధారం గా జరిగిన సంఘటనలు బట్టి , జరగబోయ్యేవి ఊహించి చెప్తారు. దీనికి నిరూపణలు ఉండవు.

No comments:

Post a Comment