కొన్ని సుమతీ శతక పద్యాలు

బద్దకము సంధ్య నిద్దుర వద్దు సుమీ
దద్దిరంబు వచ్చును దానన్
గద్దిన్తురు పెద్ద వారలు
మొద్దందురు తోటి వారలు ముద్దు సుమీ

1 comment:

  1. మీ ప్రయత్నము శతవిధముల ప్రశంసనీయము కానీ కొన్ని దోషములున్నవి ముఖ్యముగా సుమతీ శతకములోని పద్యములు

    వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతనే వేగిర పడక వివరింప దగున్
    కనికల్లగా నిజము తెలిసిన
    మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ
    =====*==============
    వినదగు నెవ్వరు జేప్పిన
    వినినంతనె వేగ పడక వివరింప దగున్
    కనికల్ల నిజము దెలిసిన
    మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ

    ఉపకారికి నుపకారము
    విపరీతము కాదు సేయ వివరించంగా
    అపరాకారికి ఉపకారము
    నేప మెన్నక చేయువాడు నేర్పరి సుమతీ
    ====*=====
    ఉపకారికి నుపకారము
    విపరీతము కాదు సేయ వివరించంగా
    అపరాకారికి ఉపకారము
    నేప మెన్నక చేయువాడు నేర్పరి సుమతీ
    ====*=====
    ఉపకారికి నుపకారము
    విపరీతము గాదు సేయ వివరింపంగా
    నపరాకారికి నుపకారము
    నెప మెన్నక సేయువాడు నేర్పరి సుమతీ

    తన కోపమే తన శత్రువు
    తన శాంతమే తనకు రక్ష
    తన సంతోషమే స్వర్గము
    తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ
    ======*======
    తన కోపమె తన శత్రువు
    తన శాంతమె తనకు రక్ష,దయ చుట్టంబౌ
    తన సంతోషమె స్వర్గము
    తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ
    తన కోపమె తన శత్రువు
    తన శాంతమె తనకు రక్ష,దయ చుట్టంబౌ
    తన సంతోషమె స్వర్గము
    తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ

    మార్పులు జేయగలరని ఆశిస్తూ
    భవదీయుడు
    వరప్రసాదు

    ReplyDelete