కొన్ని వేమన పద్యాలు

అనువుగాని చోట నథికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువు గాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినుర వేమ!

అల్పుడెపుడుఁబల్కు నాడంబరముగాను
సజ్జ నుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

అనగ అనగ రాగము అతిశయిల్లుచు  నుండు
తినగ తినగ వేము తియ్య నుండు
సాధనమున పనులు సమకూరు ధర లోన
విశ్వదాభిరామ వినుర వేమ!

అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

ఆత్మశుద్ధి లేని ఆచరమేల
భాండ శుద్ది లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజ లేలయ
విశ్వదాభి రామ వినుర వేమ

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ !

కనియు గానలేఁడు కదలింపఁడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్నిపాతం బిది
విశ్వదాభిరామ వినుర వేమ!

గంగిగోవు పాలు గంటిడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ!

చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు
చదువు జదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదువగ చూడుము
విశ్వదాభిరామ వినుర వేమ !

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్ట లోన చదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ!


పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బట్టవలయుఁ
బట్టి విడుటకన్నఁ బరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ!

పర నారీ సోదరుఁడై
పరధనములు కాసపడక!పరహిత చారై
పరు లలిగిన తా నలగక
పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!

పనస తొనలకన్న పంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్న
చెరుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ వినుర వేమ!


మేడిపండు చూడు మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడు పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ!

వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ వినుర వేమ!



15. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపే గని తెలుపు రాదయ
విశ్వదాభి రామ వినుర వేమ

No comments:

Post a Comment