అన్నమయ్య - కొన్ని జీవిత విశేషాలు

అన్నమయ్య 1424-1503 తొలి తెలుగు వాగ్గేయ కారుడు. పద కవితా పితామహుడు అని ఆయన బిరుదు.
తల్లి దండ్రులు నారాయణ సూరి (కుమరనారాయణ ) , లక్ష్మాంబ. తాళ్ళపాక కు చెందినా వారు. తాత గారు నారాయణయ్య గారు పక్కనే ఉన్నా ఉటుకూరు లోని చింతలమ్మ తల్లి గుడి వద్ద ఆత్మ హత్య చేసుకొన బోగా ఆ దేవత మూడవ తరం లో నీ ఇంట మహనీయుడు, హరి భక్తుడు పుడతాడని చెప్పి ఆయనను ఆపిందట.
ఈయన పెద్ద భార్య అక్కలమ్మ. చిన్న భార్య తిమక్క. సుభద్ర కళ్యాణం అను కావ్యాన్ని రచించిన తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి గా చెప్పబడు చున్నది.
పిల్లలు పెద్దతిరుమలచార్య , నరసింగన్న.అష్టమహిషి కళ్యాణం వ్రాసినది పెద్దతిరుమలచర్య
మనుమలు చిన్న తిరుమలాచార్య,తాళ్ళపాక చిన్నన్న .
గురువు, అహోబిలం కి చెందిన అడివన్ శఠగోప యతి. ఈయనే అన్నమయ్యకు వైష్ణవ మతం బోధించాడు.
"దాచుకో నీపాదాలకు తగనే చేసిన పూజలివి" అనేది ఈయన చివర కృతి కాగా
నారాయణతే నమో నమో" అనే కృతి పురందర దాసు తన వద్దకు వచ్చినప్పుడు ఆయనతో కలసిచేసారని ప్రతీతి .
సాళువ నరసింహ అనే విజయ నగర రాజు ఈయన ను ఆదరించి ఈయన పాటలను రాగి రేకుల పై రాయించాడు.

2 comments:

  1. అన్నమయ్య చరిత్రము చిన్నన్న వ్రాసిన ద్విపద కావ్యం ఈ క్రింది బ్లాగులో చూడగలరు.
    www.kastuuritilakam.blogspot.com

    ReplyDelete
  2. మైత్రేయి గారు
    ఇప్పుడే మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నా. నా బ్లాగ్ లో మొదటి సారి కామెంట్ చేసినందుకు చాల థాంక్స్. Internet is a very good way to reach children these days. You have selected the best medium to impart valuable knowledge to them. మీరేమి అనుకోకపోతే, మీ బ్లాగ్ కి వచ్చే వారి సంఖ్య, ఇంకా ఎ age గ్రూప్ వాళ్ళు వస్తారు లాంటి ఇన్ఫర్మేషన్ చెప్తారా? చాలా సింపుల్ గా మంచి ఇన్ఫర్మేషన్ వ్రాస్తున్నారు. I am curious as to how many people are taking an advantage of the knowledge in your blog. ఇంకొక మాట. తేనెల తేటల మాటలతో అన్న పాటని చాలా రోజుల తరవాత చూసాను. నేను స్టేజి మీద పాడిన మొదటి పాట అది (మూడో క్లాస్ లో అనుకుంటా). పొద్దున్నే మంచి పాట మీ బ్లాగ్ లో చూసాను.

    ReplyDelete