మన నదులు

భారత దేశం ఎందఱో విదేశీయులను ఆకర్షించ టానికి ముఖ్య కారణము ఇక్కడి భౌగోళిక పరిస్థితులు. మన దేశం లో పారే నదులు ఇన్నికోట్ల ప్రజలకు అన్నపానాలకు లోటు లేకుండా చేస్తుంటే ఈ దేశ గర్భములోని రత్నాలు మన పై ఇతర ప్రాంతాలకు ఈసు కలిగేట్లు చేస్తున్నాయి. 
అతి ప్రాచీనమైన మన సంస్కృతి భగవద్దత్తమైన ఈ ప్రకృతి వనరులను అనుభవించటమే కాక వాటిని గౌరవించ మని నేర్పుతుంది.
అందుకే హిందూ మతంలో అన్న దాతలైన నదులను స్త్రీ స్వరూపాలు గా భావించి దేవతలు గా పూజిస్తారు.
మన దేశ నాగరికత సింధూ నది దగ్గర పుట్టి, సరస్వతి నది వద్ద పెరిగి, సరస్వతి నది అంతరించిన తర్వాత గంగా యమునా, బ్రహ్మ పుత్రా నదీ తీరాల వద్ద వికసించింది.  తర్వాత రోజుల్లో అనేక ప్రకృతి మార్పుల వల్ల వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశం నివాస యొగ్యమై ఆ సేతు హిమాచలము ఒక నాగరికత గా వర్ధిల్లుతోంది.   గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులు ఎందరికో ఆధారం అయ్యాయి.
ప్రాచిన సంస్కృతి వ్యవసాయ ఆధారిత మైనందువల్ల  నదీ తీరాల్లో  పట్టణాలు, పుణ్య క్షేత్రాలు వెలిసాయి. కనుక నదుల గురించి వాటి పరివాహక ప్రాంతాల్లోని ఊర్లను గూర్చి తెలుసుకొంటే ప్రాచిన భారత చరిత్ర చాలా వరకు  తెలుసుకోన్నట్లే.  శత్రు దుర్భేద్యం గా ఉండటానికి పర్వత ప్రాంతాల్లో కట్టిన బురుజులు కోటలు మధ్య యుగాల నాటివైతే, నౌకా యానానికి అనుకూలం గా ఉన్నందువల్ల సముద్ర ప్రాంతాలు ఎక్కువగా ఆధునిక యుగం లో వృద్ది చెందాయి.

No comments:

Post a Comment