కృష్ణాష్టకం

ఉదయాన్నే రోజూ చదువుకో దగ్గ శ్లోకాలు . చిన్ని పదాలతో పిల్లలు నేర్చుకోవటానికి వీలుగా ఉంటుంది.

౧. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

౨. అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం
రత్న కంకణ  కేయూరం కృష్ణం వందే జగద్గురుం

౩. కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం
విలసత్ కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం

౪. మందార గంధ సంయుక్తం చారు హాసం చతుర్భుజం
బహి: పింఛావ చూడాంగం  కృష్ణం వందే జగద్గురుం

౫.  గోపికానాం కుచద్వందం కుంకుమాంకిత   వక్షసం
శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం

౭. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుసోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం

౮. శ్రీ వత్సాంగం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్ర ధరం దేవం  కృష్ణం వందే జగద్గురుం 

మన నదులు

భారత దేశం ఎందఱో విదేశీయులను ఆకర్షించ టానికి ముఖ్య కారణము ఇక్కడి భౌగోళిక పరిస్థితులు. మన దేశం లో పారే నదులు ఇన్నికోట్ల ప్రజలకు అన్నపానాలకు లోటు లేకుండా చేస్తుంటే ఈ దేశ గర్భములోని రత్నాలు మన పై ఇతర ప్రాంతాలకు ఈసు కలిగేట్లు చేస్తున్నాయి. 
అతి ప్రాచీనమైన మన సంస్కృతి భగవద్దత్తమైన ఈ ప్రకృతి వనరులను అనుభవించటమే కాక వాటిని గౌరవించ మని నేర్పుతుంది.
అందుకే హిందూ మతంలో అన్న దాతలైన నదులను స్త్రీ స్వరూపాలు గా భావించి దేవతలు గా పూజిస్తారు.
మన దేశ నాగరికత సింధూ నది దగ్గర పుట్టి, సరస్వతి నది వద్ద పెరిగి, సరస్వతి నది అంతరించిన తర్వాత గంగా యమునా, బ్రహ్మ పుత్రా నదీ తీరాల వద్ద వికసించింది.  తర్వాత రోజుల్లో అనేక ప్రకృతి మార్పుల వల్ల వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశం నివాస యొగ్యమై ఆ సేతు హిమాచలము ఒక నాగరికత గా వర్ధిల్లుతోంది.   గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులు ఎందరికో ఆధారం అయ్యాయి.
ప్రాచిన సంస్కృతి వ్యవసాయ ఆధారిత మైనందువల్ల  నదీ తీరాల్లో  పట్టణాలు, పుణ్య క్షేత్రాలు వెలిసాయి. కనుక నదుల గురించి వాటి పరివాహక ప్రాంతాల్లోని ఊర్లను గూర్చి తెలుసుకొంటే ప్రాచిన భారత చరిత్ర చాలా వరకు  తెలుసుకోన్నట్లే.  శత్రు దుర్భేద్యం గా ఉండటానికి పర్వత ప్రాంతాల్లో కట్టిన బురుజులు కోటలు మధ్య యుగాల నాటివైతే, నౌకా యానానికి అనుకూలం గా ఉన్నందువల్ల సముద్ర ప్రాంతాలు ఎక్కువగా ఆధునిక యుగం లో వృద్ది చెందాయి.

పంచకర్మలు

తర్కశాస్త్రంలో:
ఉక్షేపణం
అవక్షేపణం
అకుంచనం
ప్రసారణం
గమనం

వైద్యశాస్త్రంలో:
వమనం - వాంతి (vomiting / Emesis ) జీర్ణం కాని వ్యర్ద పదార్ధాలను బయటకు పంపటానికి ఈ పద్దతి ఉపయోగిస్తారు. సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులు, అసిడిటీ లాంటి జబ్బుల ఉపశమనానికి ఇది ఉపయోగిస్తుంది. మొండెం ని మూడు భాగాలుగా అనుకొంటే పై భాగానికి దీని ప్రభావం ఉంటుంది.
రేచనం - విరేచనం (purging) - అర్థరైటిస్ మొదలైన కండరాల నొప్పులు, చర్మ వ్యాధులు లాంటి పిత్త సంబంధమైన వ్యాధులు తగ్గటానికి ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు. నోటి మందుల వల్ల విరోచనం అయ్యి దోషం తొలగేట్టు చేస్తారు.  మొండెం లోని మధ్య భాగం పై ఇది పని చేస్తుంది.
నస్యం - చీదటం (nasal cleaning) మైగ్రేయిన్ ఇతర తలనొప్పులు, జ్ఞాపక శక్తి ఇతర మెదడుకు సంబంధించిన వ్యాధులకు ఈ పద్దతి  వాడతారు.  ముక్కు ద్వారా చికిత్స చేస్తారు.  ముఖము, మెదడు పై దీని ప్రభావం ఉంటుంది.
అనునాసనం -  (oleation enemas)  మల బద్ధకానికి సంబంధించిన దీర్ఘ కాలిక సమస్యలకు చికిత్స.
నిరూహం - (cleansing enemas) పెద్ద ప్రేవులపై ముఖ్యం  గా పని చేస్తుంది.  వాత సంబంధమైన నరాల వ్యాధులు తగ్గటానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.